సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట...! 13 h ago
సుప్రీంకోర్టులో సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్‌బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో మోహన్‌బాబు నిందితుడిగా ఉన్నారు.